'నా నువ్వే' రిలీజ్ డేట్ ఖరారు

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'నా నువ్వే'
  • కల్యాణ్ రామ్ జోడీగా తమన్నా 
  • జూన్ 14వ తేదీన భారీ రిలీజ్      
కల్యాణ్ రామ్ హీరోగా .. తమన్నా కథానాయికగా జయేంద్ర దర్శకత్వంలో 'నా నువ్వే' సినిమా రూపొందింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమా, ఈ 25వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన జూన్ 1వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమేననే టాక్ వచ్చింది.

ఈ నేపథ్యంలో వచ్చేనెల 14వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకూ యాక్షన్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ .. రొమాంటిక్ హీరోగా కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇక తమన్నా కూడా మరింత గ్లామర్ తో కనిపిస్తోంది. ఈ సినిమా యూత్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.
Go Back to Shorts
kalyan ram
thamannah

More Telugu News